- Advertisement -
నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ఆహ్వానించారు తమిళనాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.
Also Read:అసమర్ధుడి పాలనలో తెలంగాణ అల్లకల్లోలం: కేటీఆర్
- Advertisement -

