అసమర్ధుడి పాలనలో తెలంగాణ అల్లకల్లోలం: కేటీఆర్

19
- Advertisement -

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా ? అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లెవా ?! అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలం.. ..సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు…రాష్ట్ర సంపద పెంచడం,లేనిది ఆదాయం కాదు నీ మెదడలో విషయం అన్నారు. స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి.. పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు అన్నారు.

ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా, అంగన్ వాడీలలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా ? అని చెప్పారు. ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పరిపాలన రాక పెంట కుప్ప చేసి..ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందలేస్తే సహించం అన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే….కవితక్క

- Advertisement -