ప్రభుత్వ ఉద్యోగులపై ఆక్రమ కేసులా?:జేఏసీ

14
- Advertisement -

హైదరాబాద్ టీఎన్జీవో భవన్ లో మారం జగదీశ్వర్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఉద్యోగ జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్వర్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలి అన్నారు.

వెంటనే రెండు 5 డీఏలను విడుదల చేయాలి అని.. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 186 జీవోలను అమలు పరచాలి అన్నారు. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఈ ప్రభుత్వం లీక్ డిపార్ట్ మెంట్ వారిగా రివ్యూ చేసే నాథుడే లేడు అన్నారు. ఉద్యోగులకు 8 వేల కోట్లను ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలి అని.. రిటైర్డ్ అయిన ఉద్యోగులు బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పై ఆక్రమ కేసులు పెడితే సహించం.. సబ్ కమిటీ వేసి 5 నెలలు అవుతున్న పట్టించుకోవడం లేదు అన్నారు. ఉద్యోగుల అండగా జెఏసి పోరాడుతుందన్నారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కారించడం లో ప్రభుత్వం విఫలమైందన్నారు జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు. ప్రభుత్వం పై ఉద్యోగులు అసంతృప్తి గా ఉన్నారు..ఉద్యోగుల కు ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ లేవు అన్నారు. ప్రతి ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది.. డిప్యూటీ సీఎం ,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ఎన్నో సార్లు కలిసి వినతి చేశాము అన్నారు. ఈ సారి బడ్జెట్ లో ఉద్యోగుల కు న్యాయం చేయాలని కోరుతున్నాం అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.. ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అన్నారు.33 జిల్లాల్లో ఉద్యోగ జేఏసీ ని ఏర్పాటు చేస్తా.. త్వరలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తాం అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు కూడా వెనుకాడం అన్నారు.

Also Read:ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

- Advertisement -