- Advertisement -
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కీలక సూచన చేసింది ఐఎండీ. గురువారం అస్సాం,మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
శుక్ర,శనివారం రోజుల్లో జమ్మూకాశ్మీర్,లడఖ్,హిమాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురు,శుక్ర,శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.
#WATCH | A layer of dense fog witnessed in Haryana’s Jhajjar. pic.twitter.com/ke3KwWQHLw
— ANI (@ANI) March 12, 2025
Also Read:మంత్రి పదవి రేసులో ఉన్నా: మల్‌రెడ్డి
- Advertisement -

