హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేయనున్నారు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. అంతేగాదు సినిమా ప్రమోషన్స్‌లో కూడా వార్నర్ పాల్గొంటాడని చిత్ర యూనిట్ చెప్పిన నేపథ్యంలో సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తెలుగు ప్రజలకు చేరువయ్యాడు వార్నర్. టిక్ టాక్ ఉన్న సమయంలో అల్లు అర్జున్, మహేష్ బాబు అలాగే ప్రభాస్ లాంటి స్టార్స్ పై పలు వీడియోలు చేసి తెలుగు ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఏకంగా సినిమాల్లో కనిపించనుండటం ఖచ్చితంగా ఓ విశేషమనే చెప్పాలి.
Also Read:27 వరకు అసెంబ్లీ సమావేశాలు

