గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు: హరీష్

15
- Advertisement -

గవర్నర్ ప్రసంగంలో దశ లేదు దిశ లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన హరీష్ రావు.. గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదు అన్నారు. సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు అన్నారు.

ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలు అని.. ఏడాదిన్న పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగం నిదర్శనమన్నారు. అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ ది అని మండిపడ్డారు.

రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ గారిని కూడా వాడుకోవడం సిగ్గుచేటు అని.. గవర్నర్ గారు మహాత్మ గాంధీ గారు చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారు అన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం డిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు అన్నారు. 20శాతం కమిషన్లు తీసుకోవడమేనా మీరు చెప్పిన ఇంక్లూసివ్ డెవలప్మెంట్ చెప్పాలన్నారు.

ప్రజల సేవ ఎక్కడిది, స్వయం సేవా, ఢిల్లీ సేవలో తరిస్తున్నరు రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం.. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాజీవ్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు అన్నారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వల్ల అది సాధ్యమైందన్నది వాస్తవం.. గొప్పగా చెప్పిన 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పదేళ్ల కృషితో సాధ్యమైందా, మీ ఏడాదిన్నర పాలనలో సాధ్యమైందా? చెప్పాలన్నారు.

ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామి నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదు.. ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నరు అని దుయ్యబట్టారు. ఎస్ జీ హెచ్ లకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు… 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్దం చెప్పారు. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఏటా 2లక్షల ఉద్యోగాలు అని యువతను మోసం చేసారు… విద్యావ్యవస్థ నిర్వీర్యం చేశారు. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు అన్నారు.\

Also Read:27 వరకు అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -