అబద్దానికి కేరాఫ్ అడ్రస్‌.. సీఎం రేవంత్

14
- Advertisement -

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క   పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీష్‌.. అబద్దానికి అంగీ లాగు తొడుగుతే ఎట్లుంటది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటంది..బాధ్యయుతమైన పదవిలో ఉండి జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలి అన్నారు.

ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పై అడ్డగోలుగా మాట్లాడాడు. ఇప్పుడు అధికారంలో ఉండి అబద్దాలు మాట్లాడుతున్నడు.. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మోసం చేశారు, నేను గత అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు సీతక్క గారు సమాధానం ఇచ్చిన దాని ప్రకారం, 5లక్షల వరకు మాత్రమే ఎస్ హెచ్ జీ, స్త్రీనిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం అని 2015లో అని కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారు అన్నారు.

అంతకంటే ఎక్కువ తీసుకుంటే 12.5శాతం బ్యాంకులు చార్జ్ చేస్తున్నాయి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెబుతున్నది. ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణం అంటున్నరు…21వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే, మొత్తం 21వేల కోట్లు ఇచ్చినట్లు దగా చేస్తున్నడు అన్నారు.నిన్న చేసిన ప్రచారం డొల్ల ప్రచారం, గోబెల్స్ ప్రచారం,మూడు, నాలుగు కోట్లకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి అన్నారు.మిగతా 16వేల కోట్లకు 12శాతం చొప్పున మహిళా సంఘాలు వడ్డీ చెల్లించాల్సింది ఉంటుంది.. ఎన్నికల మానిఫెస్టోలో రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుతమన్నరు అన్నారు.

రాష్ట్రంలోని మహిళలందరిని కాంగ్రెస్ మోసం చేసింది.. ఈ ఆర్థిక సంవత్సరంలో నయా పైసా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ లేని రుణం కింద విడుదల చేయలేదు.. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు హరీష్‌ రావు. 21వేలు కోట్లు ఇస్తే గనుక దానికి వడ్డీ 2100 కోట్లు అవుతాయి…మీ అబద్దాలు వినలేక మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.. మొత్తంగా మీరు చెప్పిన 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది శుద్ద అబద్దం అన్నారు.

Also Read:కాంగ్రెస్‌కు 3..బీఆర్ఎస్‌కి 1, సీపీఐ1

- Advertisement -