రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఓ మీడియా చర్చా వేదికలో అనేక అంశాలు ప్రస్తావించారు అన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. సీఎం, మంత్రుల మాటలను చూస్తుంటే రాష్ట్రంలో సుతి, మతి, గతి లేని ప్రభుత్వం ఉందని అర్థమవుతుంది. సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదు అన్నారు. ఓ వైపు ఇప్పుడు సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అంటున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినప్పుడు తమకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు అన్నారు. నెలకు 500 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి వ్యయం చేసే స్థితి లేమని సీఎం అంటున్నారు అన్నారు.
మరోవైపు అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంటున్నారు… సీఎం రాష్ట్ర పరువు తీస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు, ఒలింపిక్స్ నిర్వహణకు అసలు సంబంధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి మాటలు జోకర్ మాటలు అన్నారు. కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించాలని భట్టి ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. మొహం చూపించలేక వెనక గేటు నుంచి భట్టి పారిపోయారు. కాంట్రాక్టర్లకు, సర్పంచ్ లకు, ఉద్యోగులకు బిల్లులు చెల్లించని అసమర్థ ప్రభుత్వం ఇది. 20 శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు ఇస్తున్నారు అన్నారు.
గత ఒలింపిక్స్ నిర్వహణకు లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహణ నుంచి పారిపోతున్నాయి. “మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగె నూనె” అన్నట్టు ఉంది రేవంత్ తీరు… ఒలింపిక్స్ నిర్వహణకు ముందు దేశం సిద్ధం కావాలి.. రాష్ట్రం కాదు. సీఎం సంచలనాల కోసం గప్పాలు కొడుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని అంటున్న రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసును ఎందుకు తప్పు పట్టారు? చెప్పాలన్నారు. ఫార్ములా-ఈ కి రూ. 45 కోట్లు ఖర్చయితే రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.250 కోట్ల రూపాయలతో మిస్ వరల్డ్ పోటీలు జరిగితే అందులో కూడా అవినీతి జరుగుతుందా? కేటీఆర్ పేరును ఫార్ములా ఈలో బద్నామ్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారు అన్నారు.
Also Read:కోర్ట్ మూవీపై నాని సంచలన వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు. ఈ ప్రభుత్వంలో చెప్పినవి ఏవీ అమలు కావడం లేదు.. మార్చి 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ అన్నారు… ఏమైంది?,తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని రేవంత్ ఓ వైపు అంటూ కేసీఆర్‌ను తిడితే ఎలా? 14 నెలల్లోనే తెలంగాణ దేశానికి మోడల్ అయిందా? కేసీఆర్ కృషితోనే తెలంగాణ రోల్ మోడల్ అయింది అని తెలిపారు. జాతీయ వేదికల మీద రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయొద్దు… ముందు చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చిన తర్వాత సీఎం వేరే పెద్ద విషయాలు మాట్లాడాలి అన్నారు.
అఖిల పక్ష ఎంపీ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే హాజరయ్యాయి. ఇది అఖిల పక్ష మీటింగ్ కాదు, దిశా దిశ లేని మీటింగ్, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు కలిస్తే గుండు సున్నా… రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడే సత్తా ఉంది… రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ బంధం కొనసాగుతోంది… మోదీ-రేవంత్‌లు “బడే భాయ్ – చోటే భాయ్” లాగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను అఖిల పక్ష సమావేశానికి పిలిస్తే ఎలా? చెప్పాలన్నారు శ్రీధర్ రెడ్డి.

