26 నుంచి… ‘నెంబ‌ర్ 1 యారీ విత్ రానా’

291
No. 1 Yaari With Rana
- Advertisement -

కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భల్లాలదేవ రానా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు.  ఈ ప్రోగ్రాం ఈ నెల 26నుంచి ప్రారంభం కానుంది. ఇటీవ‌లే యూరీ విత్ రానా షో సెట్‌లో న‌టులు సుమంత్, నాగచైతన్య కలిసి పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సుమంత్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల‌ను అల‌రించింది. రానా టీవీలో షో మొదటి ఎపిసోడ్‌లో సుమంత్‌, నాగ‌చైత‌న్య‌లే క‌నిపించ‌నున్నార‌ట‌. ఇక రెండవ ఎపిసోడ్‌లో అక్కినేని అఖిల్, రాజమౌళి తనయుడు కార్తికేయ క‌నిపిస్తార‌ట‌.

No. 1 Yaari With Rana
కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే కాఫీ విత్ కరణ్ తరహాలో నెం 1 యారి టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆసక్తికరమైన విశేషాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అంటున్నారు.

టాలీవుడ్ అగ్రహీరోలు ఇటీవల వరసుగా బుల్లితెర బాట పట్టిన సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంను తెలుగులో .. మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నాగార్జున, చిరంజీవి రన్ చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు మరికొన్ని పాపులర్ టీవీ షోస్ ను తెలుగులో నిర్వహించబోతున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రన్ చేసిన బిగ్ బాస్ టీవీ షో జనాన్ని బాగా ఆకట్టుకొంది. దాన్ని ఇప్పుడు తమిళంలో కమల్ హాసన్ టేకప్ చేశాడు. తెలుగులో జూనియర్ ఎన్ టీఆర్ చేపట్టబోతున్నాడు. తాజాగా వీరి బాటలో రానా చేరాడు.

- Advertisement -