ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యమా?: సుప్రీం ఫైర్

13
- Advertisement -

ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషధాల ధరలు పెరిగాయి అని చెప్పుకొచ్చింది సుప్రీం కోర్టు.

ఆ ప్రైవేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోండి అని సూచించింది. సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది.

తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు , హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్లకు నోటీసులు జారీచేసింది.

Also Read:ఆర్జీవీకి సీఐడీ అధికారుల నోటీసులు

- Advertisement -