6న తెలంగాణ కేబినెట్ సమావేశం..

14
- Advertisement -

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్‌లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే రెండో దశ సమగ్ర కులగణనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది . ఏపీతో నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read:కాంగ్రెస్‌..కరెంట్,నీళ్లు, రైతు బంధు రాదు!

- Advertisement -