లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా అని ఏపీ శాసనమండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు.. పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలి అన్నారు.
అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా..? చెప్పాలన్నారు. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనడానికి ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తా..? చెప్పాలన్నారు. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం అన్నారు బొత్స.
ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయికి ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు. క్రైమ్ రేట్ తగ్గించాలంటే మత్తు పదార్థాలను అరికట్టాలి.. ఇందు కోసం ఈగల్ వింగ్ ను ఏర్పాటు చేశాం అన్నారు అనిత.
Also Read:సీఎం రేవంత్‌కు 10 వేల పోస్టు కార్డులు: కవిత

