- Advertisement -
బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలోని అన్ని కీలక పదవుల నుంచి తన మేనల్లుడు అకాశ్ ఆనంద్‌ను తొలగించారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకూ పార్టీలో తనకెవ్వరూ వారసులు ఉండరని ముఖ్య నేతల సమావేశంలో తెలిపారు.
జాతీయస్థాయిలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి సమన్వయకర్తలుగా ఆమె సోదరుడు ఆనంద్ కుమార్, రాంజీ గౌతమ్ నియమితులయ్యారు. పార్టీ, ఉద్యమం తనకు ముఖ్యమైనవని, బంధాలు, బంధుత్వాలు వాటి తర్వాతేనని ఈ సందర్భంగా మాయావతి చెప్పారు.
Also Read:కర్తవ్యాన్ని మరిచింది ఎవరు?:సీఎంపై హరీశ్ ఫైర్
గతేడాది మేలో కూడా అకాశ్ ఆనంద్‌ను పార్టీలో అన్ని పదవులు నుంచి మాయావతి తొలగించారు. మళ్లీ కొద్ది రోజులకే తన వారసుడిగా ప్రకటించి పదవులు కట్టబెట్టారు.
- Advertisement -

