రక్షణ రంగానికి కేంద్రంగా హైదరాబాద్: రేవంత్

11
- Advertisement -

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి అన్నారు.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి అన్నారు. దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది… లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.

Also Read:మహా సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారు… వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నాం అన్నారు.తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్ధవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.

దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం అన్నారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యానికి కూడా, తర్వాత కూడా హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఎచ్‌ఎల్, మిదాని, డీఆర్‌డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయి అన్నారు. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి అన్నారు.

గతంలో మీతో చర్చించినట్టుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి… తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయి అన్నారు.రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయి. .. అందుకోసం మీ సహకారం, మద్దతు అవసరం అన్నారు.రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తాం అన్నారు.

- Advertisement -