విజయ్‌ని గెలిపిస్తా : ప్రశాంత్‌ కిషోర్‌

6
- Advertisement -

తమిళనాడులో విజయ్‌ని గెలిపస్తానని తెలిపారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు టీవీకే చీఫ్‌ విజయ్‌ కొత్త ఆశాకిరణమని తెలిపారు.తమిళనాడులోని చంగల్పట్టు జిల్లాలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం టీవీకే రెండో వార్షిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐపీఎల్‌లో క్రికెటర్‌ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును గెలిపించినట్లుగా తాను రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగంను గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్రంలో పోవాలి అన్నారు. విజయ్ ఆలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు అన్నారు. నేను ఏ పార్టీతో, నాయకుడితో కలిసి పనిచేయనని నాలుగేళ్ల క్రితమే ప్రకటించాను కానీ విజయ్‌ నాకు రాజకీయ నాయకుడు కాదు. ఆయన నాకు ఓ బ్రదర్‌ లాంటివాడు అని వెల్లడించారు.

Also Read:SLBC:6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

- Advertisement -