- Advertisement -
ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. SLBC టన్నెల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
కేంద్ర బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని మోదీకి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్నివిధాలుగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రధానితో చర్చించారు.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి.
Also Read:ట్రంప్ బంపర్ ఆఫర్..గోల్డ్ కార్డు!
- Advertisement -

