ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహించదు అని తేల్చిచెప్పారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ .పశ్చిమాసియా ఘర్షణలు, సముద్ర భద్రత, ఉక్రెయిన్ వివాదం, ఇండో-పసిఫిక్, యూఎన్ సంస్కరణలపై భారతదేశ వైఖరిని వెల్లడించారు.
భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోదని, మానవతా సహాయానికి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణలు నెలకొంటున్న ఆయా ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం ప్రపంచ దేశాలకు చాలా అవసరమని అన్నారు.
ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, కొవిడ్ మహమ్మారి సవాళ్లు, వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్నాయన్నారు. జి-20 మన ఆసక్తులు, సంస్కృతులు, దృక్పథాల వైవిధ్యాన్ని సంగ్రహిస్తుందన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై జైశంకర్ మాట్లాడుతూ.. యుద్ధం నివారించడానికి ఇరుదేశాల అధినేతలు చర్చల్లో పాల్గొనాలని భారత్ చాలాకాలంగా సూచిస్తోందన్నారు.
Also Read:భారత్లో టెస్లా … ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

