శ్రీశైలంలో రెండోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

15
- Advertisement -

శ్రీశైలంలో రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు చేయనున్నారు. సాయంకాలం భృంగివాహనసేవ ఉండనుండగా లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు చేయనున్నారు.

ఈ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారి తరుపున శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పించనున్నారు. సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం ఉండనుంది.

గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉండనుండగా ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలలు చేపట్టనున్నారు.

Also Read:టీపీఎల్‌ నిర్వహణకు SRH సహకారం

- Advertisement -