మళ్లీ అధికారం మనదే: కేసీఆర్

11
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు.

ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Also Read:సిరిసిల్ల కలెక్టర్ తీరుపై కేటీఆర్ ఫైర్..

- Advertisement -