ప్రభుత్వ హాస్టళ్ల పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని.. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజన మెనూ వివరాల పై రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది.
వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొంది హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, పాఠశాలల భవనాల నిర్వహణ, వసతుల పై న్యాయవాది చిక్కడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది హైకోర్టు ధర్మాసనం.
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని వెల్లడించిన తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.9 వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని తన వాదనలలో తెలిపారు ప్రభాకర్. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు.
Also Read:సిరిసిల్ల కలెక్టర్ తీరుపై కేటీఆర్ ఫైర్..

