వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

14
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. ఇక పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే తొలుత ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్టు డేట్‌ను కూడా ప్రకటించారు. కానీ హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం.

హరిహర వీరమల్లును ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్‌కే విడుదల చేస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ వర్క్‌ పూర్తయింది. బ్యాలన్స్‌ వర్క్‌ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న డేట్‌కే విడుదల చేస్తాం.’ అని తెలిపారు ఏఎం రత్నం. ఈ సినిమాలోని రెండో పాట ఈ నెల 24న విడుదల కానుందని తెలిపారు.

Also Read:కుంభమేళాలో పవన్ కళ్యాణ్

- Advertisement -