ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌తో పాటు భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనతో కలిసి ఫుణ్యస్నానలు ఆచరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్… సనాతన ధర్మం గురించి మాట్లడుతూ.. సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వానికి నిదర్శనం అన్నారు. దేశంలోని సగం జనాభా పుణ్య స్నానాలు ఆచరించడం గొప్ప విషయమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా కుంభమేళా ఏర్పాట్లు పక్కాగా చేసిందని కొనియాడారు.
భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారన్నారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పని చేస్తుందో.. ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పని చేస్తుందన్నారు. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్థిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలన్నారు.
కుంభమేళాలో దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు.
Also Read:పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..

