ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం..

14
- Advertisement -

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండించారు దేవినేని అవినాష్. వంశీపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది.. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు అవినాష్.

వల్లభనేని వంశీ అరెస్ట్ పై X వేదికగా స్పందించింది వైసీపీ. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ ఉందన్నారు.

ఇటీవల సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.. చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అని మండిపడ్డారు.

Also Read:వృక్షార్చన..మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతులు

- Advertisement -