శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీనలగ్నం)
రాత్రి – పెద్దశేష వాహనం
19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
20-02-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
Also Read:హోంగార్డులకు జీతాలేవి?: హరీశ్ రావు
22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
23-02-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – స్వర్ణరథం,
రాత్రి – గజ వాహనం
24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
25-02-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
26-02-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

