నానితో ఫస్ట్‌డే ఫస్ట్‌ షోలో జక్కన్న..

227
- Advertisement -

వరుస విజయాలతో సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు నేచురల్‌స్టార్‌ నాని. ఇటీవలే ‘నేను లోకల్‌ ‘ అంటూ సూపర్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న నానీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదే దూకుడును ప్రదర్శిస్తూ.. మరో సినిమాకి గ్యాప్‌ లేకుండా కమిట్‌ అయ్యాడు నాని. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు.

Rajamouli Response On Ninnu Kori Trailer

అయితే నాని కథానాయకుడుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని చూసిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ట్విటర్‌లో స్పందించారు. ‘‘నిన్ను కోరి’ ట్రైలర్‌ మొత్తం ‘దీన్ని నేను ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడాలి’ అని పెయింటింగ్‌ వేసి ఉంది. నాని టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు’ అని జక్కన్న ట్వీట్‌ చేశారు. దీనికి వెంటనే నాని స్పందిస్తూ ‘సర్‌.. సగం విజయం అందుకున్నట్లు ఉంది. ధన్యవాదాలు. ఫస్ట్‌డే ఫస్ట్‌ షోలో కలుద్దాం’ అని నవ్వుతూ అన్నారు.

‘నిన్ను కోరి’ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌తో కలిసి ఇప్పటి వరకు 50 లక్షల మంది దీన్ని వీక్షించారు. విడుదలైన 24 గంటల్లో ఇన్ని వ్యూస్‌ రావడం పట్ల టీం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను జూన్‌ 29న నిర్వహిస్తున్నారు. జులైలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నాని మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నటే అంటుంన్నాయి సిని వర్గాలు.

- Advertisement -