రజినీ భార్యగా సీనియర్ నటి..

216
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 161వ చిత్రం ‘కాలా’. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘కబాలి’ తర్వాత మరోసారి యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కాలా మూవీ రోజు వార్తల్లో నిలస్తుంది.తాజాగా ఈ మూవీ గురించి మరో వార్త వినిపిస్తుంది.

కాలాలో రజినీ సరసన హీరోయిన్‌గా పలు తారలను పరిశీలించారు.అయితే ఇప్పుడు సీనియర్‌ హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది. అమె ఎవరంటే..ఈశ్యరి రావు. ఈమె తెలుగు మహిళే అయినా.. ఓ తమిళ్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈశ్వరి రావు.. జగన్నాటకం చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఐదేళ్లకు మళ్లీ తెలుగులో బాపు సినిమా రాంబంటులో యాక్ట్ చేసిన తర్వాత చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ సినిమాల ఎంపికలో బాగా సెలెక్టివ్ గా ఉండే ఈశ్వరి రావు.. ఇప్పుడు మళ్లీ సెన్సేషన్ అయిపోతోంది.

Rajinikanth to Romance Easwari

రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా కరికులన్ లో.. ఆయనకు భార్యగా నటిస్తోంది ఈశ్వరీ రావు. ‘ఈ పాత్రలో.. నన్ను బిగ్ స్క్రీన్ పై చూడడం.. నా పిల్లలకు నేనిచ్చే ఓ అరుదైన గిఫ్ట్.. ఇంతకు మించి ఈ పాత్ర గురించి ఏమీ చెప్పలేను’ అంటోందీ సీనియర్ నటి. ఎంతటి క్రేజ్ వచ్చినా ఎన్ని ఆఫర్స్ వచ్చినా మూవీస్ ఎంచుకోవడంలో మాత్రం తాను చాలా అంశాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్న ఈమె.. అప్పుడప్పుడూ మాత్రమే సినిమాలు చేస్తుండడం విశేషం. ఇప్పటివరకూ హీరోకు అమ్మ పాత్రలలో వరుసగా కనిపించిన ఈశ్వరిరావుకు.. ఒక్కసారిగా రజినీకాంత్ సినిమాలో.. మెయిన్ రోల్ కు జోడీగా నటించే ఛాన్స్ రావడం విశేషమే మరి.

- Advertisement -