రంగరాజన్‌పై దాడి దుర్మార్గం: కేటీఆర్

35
- Advertisement -

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగరాజన్‌ ను పరామర్శించిన కేటీఆర్… రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదు అన్నారు.

దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు కేటీఆర్.

దేవుడికి సేవ చేసే వారి మీద దాడి జరిగిందంటే అది దేవుడిపైనే దాడి జరిగినట్లు అన్నారు.

Also Read:అమెరికాకు ప్రధాని మోడీ

 

- Advertisement -