ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 24వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహా కుంభమేళాను సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఆయన త్రివేణీసంగమంలో వేద మంత్రాల నడుమ పవిత్ర స్నానం ఆచరించారు.చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.
Also Read:TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు