MRPS సభకు అనుమతి నిరాకరణ.. మందకృష్ణ ఫైర్

1
- Advertisement -

ఫిబ్రవరి 7 న లక్ష డప్పులు – వేల గొంతులతో సాంస్కృతిక ప్రదర్శన తలపెట్టాము అన్నారు ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరకరించడాన్ని మేము ఖండిస్తున్నాం.. అనుమతి ఇవ్వడం కుదరదని లిఖిత పూర్వకంగా మాకు సమాచారం ఇచ్చారు అన్నారు.

అనుమతి నిరాకరించడం పై ఒకసారి పునసమీక్షించుకోవాలి..ఆ రోజు మాకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న అన్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడం లేదు.. దీన్ని అపార్థం చేసుకోవద్దు.. మా గుండె లోతులో ఉన్న భాధని అర్దం చేసుకోవాలి అన్నారు.

వర్గీకరణ అమలుకోసం మా డప్పుల ద్వారా మా భాదను ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించాలనే ఈ ప్రదర్శన.. మా మూలాలను మర్చిపోవద్దని లక్షల డప్పులతో చేసే ఈ ప్రదర్శన ను సాంస్కృతిక కార్యక్రమంలా మాత్రమే చూడాలన్నారు. అనుమతి నిరకరించడానికి సాకులు వెతికారు..

కావాలనే పర్మిషన్ ఇవ్వడం లేదు అని అర్థమైంది..మళ్ళీ ఈ రోజు కమిషనర్ కు పర్మిషన్ కోరుతూ లెటర్ ఇస్తాము అన్నారు. మా ఉద్యమంలో అసాంఘిక శక్తులు ఎలా చొరబడతారు..మీరు పంపిస్తే తప్ప ఎవరూ చొరబడరు..చొరబాటు దారులను మీరు పంపిస్తే అప్పుడు ఆస్తులు ధ్వంసం కావొచ్చు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక న్యాయం ఇతర వర్గాల ప్రజలకు ఒక న్యాయమా..మొన్న డిశంబర్ 9 న లక్ష మందితో సచివాలయం లోనే సభ పెట్టారు కదా..అప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తలేదా..సాధారణ ప్రజలకు సోయి ఉంది.. ప్రభుత్వానికి ఎందుకు లేదు..ముఖ్య మంత్రి అనుమతి ఇవ్వవద్దని చెప్పాడేమో..
ముఖ్య మంత్రికి మా ప్రదర్శన ఇష్టం లేదు అనుకుంటా..మాకు సహకరించాలని ముఖ్యమంత్రి ని కోరుతున్నా అన్నారు.

Also Read:బీసీల జనాభా.. నివేదిక తప్పుల తడక!

- Advertisement -