పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో భాగంగా ఓ చిన్న ఫంక్షన్ లో కార్యకర్తలతో ముచ్చటించిన పొంగులేటి..ఈ నెల 15వ తేదీ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోందని వెల్లడించారు.
ఇప్పటికే కులగణన సర్వే పూర్తై దానికి సంబంధించిన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించి ఎంత ఓటింగ్ శాతం ఉంది అనే దానిపై స్పష్టమైన నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో 4వ తేదీన మంత్రివర్గం సమావేశం కానుందన్నారు.
కులగణన నివేదికను అసెంబ్లీలో ఆమోదించాక పంచాయతీ ఎన్నికలకు వెళ్తామన్నారు. కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించొద్దని సూచించారు.
Also Read:TTD:రథసప్తమి .. వీఐపీ దర్శనాలు రద్దు