- Advertisement -
తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. రెవిన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియమాలకు సీఎం కేసీఆర్ అమోద ముద్ర వేశారు. వెంటనే నియమకాలను చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు-21, డిప్యూటీ కలెక్టర్లు-8, డిప్యూటీ తహశీల్దార్-38, రిజీస్టేషన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్లు-50, సర్వేయర్ -10, వీఆర్వో -700, వీఆర్ఏ-1000, డిప్యూటీ సర్వేయర్లు-100, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు-400, జిల్లా రిజిస్ట్రార్-7, సబ్ రిజిస్ట్రార్లు-22, సర్వేయర్లు-110, కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్లు-50, తదితర పోస్టులున్నాయి. ప్రభుత్వంలోని ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వేగంగా భర్తీ చేయాలని ఆదేశిచింది సర్కార్. ఈ రోజు ఉదయమే రెవెన్యూ శాఖలో మొత్తం 137 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే.
- Advertisement -