రేపే ఫైనల్‌.. గంగూలీని తాకిన పాక్‌ సెగ !

178
Pakistani Fans Attack Sourav Ganguly's Car
Pakistani Fans Attack Sourav Ganguly's Car
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్‌ దశలో భారత్‌తో పాకిస్థాన్ ఓడడాన్ని పాకిస్థానీలు తట్టుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ దేశ మీడియా దుమ్మెత్తి పోసింది. దీంతో తరువాత మ్యాచ్‌లు అనూహ్యంగా గెలిచి ఫైనల్‌కి వెళ్లారు. ఛాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం హౌ ఓల్టేజ్ మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్ వేదిక కానుంది. మినీ వరల్డ్‌కప్‌ అసలు సిసలు సమరం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు పాకిస్తాన్ క్రికెట్‌ అభిమానులు తమ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఇండియాపై ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కోరుకుంటున్నారు. తాజాగా వారి వెర్రీ భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూళీని తాకింది. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు గంగూలీపై దాడికి ప్రయత్నించారు.

ఇండియా ముర్దాబాద్…పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. మరికొందరు ఆయన కారెక్కే ప్రయత్నం చేశారు. ఇంకొందరు ఆయన కారు డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న గంగూలీ పాకిస్థాన్ వెర్రి అభిమానులను, వారి చేష్టలను చూస్తూ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా…చిరునవ్వుతో కూర్చున్నారు. ఇంతలో లండన్ పోలీసులు వచ్చి, గంగూలీ కారుకు దారిచ్చి పంపించారుసౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా సేవలందిస్తున్నారు. ఈ సంఘటన భారత అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేస్తోంది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించి తగిన సమాధానం చెప్పాలని జట్టును కోరుతున్నారు. కాగా, గంగూళీ ఓ షోలో ఇంగ్లాండ్, భారత్‌లు ఫైనల్‌లో తలపడతాయని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరిన ఆనందంలో పాక్ అభిమానులు దాదా కారును అడ్డుకున్నారు.

ఇక కోహ్లీ కెప్టెన్ గా తొలి ఐసీసీ టోర్నీ ఫైనల్ ఆడబోతున్నాడు. కెప్టెన్ గా ధోనికి కూడా మొదట ఐసీసీ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ తోనే మ్యాచ్ ఆడాడు. 2007 టీ 20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పైనే మ్యాచ్ గెలిచి.. కప్ సాధించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ కు చేరడం ఇది నాలుగోసారి. 2000 సంవత్సరంలో రన్నరప్ గా నిలిచిన భారత్… 2002, 2013లో కప్ సాధించింది.

https://youtu.be/bdTxi5XKO8Y

- Advertisement -