కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఈ మేరకు 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మఖానా బోర్డు ఏర్పాటు – ఉత్తర బీహార్ రైతులకు కేంద్ర పథకాల ప్రయోజనాలు అందించేందుకు మఖానా బోర్డును స్థాపించనున్నారు.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు – బీహార్‌లో పౌర విమానయానాన్ని పెంపొందించేందుకు కొత్త ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయనున్నారు.మిథిలాంచల్ కాలువ ప్రాజెక్ట్ – మిథిలాంచల్ ప్రాంత రైతులకు ప్రయోజనం కలిగించేలా కొత్త కాలువ ప్రాజెక్టును ప్రకటించారు. ఐఐటీ పాట్నా విస్తరణ – రాష్ట్ర విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఐఐటీ పాట్నాను సామర్థ్యాన్ని పెంచి విస్తరించనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ, బీజేపీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ఇక దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. బిహార్‌కు పెద్దపీట వేయడం ఇది కొత్తేమీ కాదని కానీ ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడం సరికాదని సూచించారు.
Also Read:Budget 2025:కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం