- Advertisement -
మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మృత్యువాత పడగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
కుంభమేళా ఏర్పాట్లపై ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఘటనకు మరో కారణంగా చెప్పుకోవచ్చని విశ్లేషించారు.లాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఏర్పాట్లను మెరుగుపర్చాలన్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఏర్పాట్లు సరిగా చేయకపోవడం తీవ్రంగా ఖండించాలన్నారు.
Also Read:వేసవిలో ఈ వ్యాధులు అధికం.. జాగ్రత్త !
- Advertisement -