మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట జరిగింది. సంగం నది దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒకరిపై ఒకరు పడిపోగా వారి ఆర్తనాదాలతో కుంభమేళాలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తక్షణమే బాధితులకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
మౌని అమావస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన భక్తులతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఇక కుంభమేళాలలో ఇప్పటివరకు 15 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర