- Advertisement -
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో వందో ప్రయోగాన్ని చేపట్టింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది జీఎస్ఎల్వీ-ఎఫ్15. ఈ రాకెట్ 50.9 మీటర్లు పొడువు, 2,250 కిలోల బరువు ఉండగా నావిక్లో భాగమైన ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. ఎన్వీఎస్-02 ఉపగ్రహం బరువు 2,250 కిలోలు.
మంగళవారం అర్థరాత్రి 2.53 గంటల నుండి కౌంట్ డౌన్ కొనసాగింది. ఇస్రోకు ఇది వందో ప్రయోగం కాగా ఇప్పటివరకు 9 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.
భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. అలాగే మొబైల్ ఫోన్లలో లొకేషన్ ఆధారిత సేవల కోసం, వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణ కోసం ఈ ప్రయోగం చేపట్టారు.
Also Read:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
- Advertisement -