అను ప్రొడక్షన్స్ నుంచి ఫిబ్రవరిలో నెలలో ‘గార్డ్ – రివెంజ్ ఫర్ లవ్’ అనే చిత్రం రానుంది. రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా థ్రిల్లర్, హారర్ వంటి అంశాలతో రూపొందింది. విరాజ్ రెడ్డి చీలం ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగ పెద్ది దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా, స్పైన్ చిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో.. సుశాంత్ పాత్రలో సెక్యూరిటీ గార్డుగా విరాజ్ రెడ్డి కనిపిస్తున్నాడు. ల్యాబ్, అందులోని దెయ్యం అంటూ ఇలా హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన టీజర్ అందరినీ భయపెట్టేలా ఉంది. ఇక ఈ టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది.
విరాజ్ రెడ్డి చీలం యాక్షన్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చూస్తుంటే యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. లవ్ ట్రాక్‌ను కూడా ఈ టీజర్‌లో చూపించారు. సామ్-సుశాంత్ ట్రాక్ యూత్‌కు నచ్చేలా, వారు మెచ్చేలానే ఉంది. ప్రేమ పేరుతో ఊహించని శక్తులపై హీరో చేసే పోరాటాలు ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి మార్క్ కెన్‌ఫీల్డ్ సినిమాటోగ్రాఫర్‌గా, సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీత దర్శకుడిగా, రాజ్ మేడ ఎడిటర్‌గా పని చేశారు. ఈ మూవీకి ప్రణయ్ కాలేరు పాటలకు బాణీలను అందించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Also Read:ఎంపీ పదవికి విజయసాయి రాజీనామా