ఆస్ట్రేలియా ఓపెన్.. వైదొలిగిన జకోవిచ్

3
- Advertisement -

కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు గాయం పెద్ద ఇబ్బంది తెచ్చింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్‌ నుండి వైదొలిగాడు నొవాక్ జకోవిచ్. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన జకోవిచ్‌ తొలి సెట్‌ అనంతరం గాయం కారణంగా మ్యాచ్ నుండి బయటకు వెళ్లిపోయాడు. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపి అభిమానులకు అభివాదం చేసి కోర్టును వీడాడు.

ఈ పరిణామంతో ఫ్యాన్స్‌ తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఇవాళ జరిగే రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే ఆటగాడితో జ్వెరెవ్‌ టైటిల్‌ కోసం పోరాడనున్నారు. ఆదివారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 ఫైనల్‌ జరుగనుంది.

దాదాపు 1 గంట 21 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ను జ్వెరెవ్‌ 7-6 (7/5)తో గెలిచాడు.

Also Read:ఎటు చూసినా నోట్ల కట్టలే!

- Advertisement -