రేవంత్ రెడ్డి.. తాను చదువుకోక.. చదువుకున్న వాళ్లను కించపరిచేలా మాట్లాడుతున్నాడు అని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి. కంప్యూటర్ మీద పనిచేసేవాళ్లు వర్కర్స్ మాత్రమే అంటూ.. ఐటీ ఉద్యోగులను కించపరిచేలా దావోస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అంతర్జాతీయ వేదికపై ఇలా మాట్లాడటం.. రాష్ట్ర పరువు తీయడమే. ఓ వైపు ఐటీ రంగంలో వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్పుకుంటున్న వేదికపైనే ఇలా మాట్లాడటం దురదృష్టకరం. సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న ఈ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే.. అందులో కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయాల్సిందే. ఆ విషయం కూడా తెలియకుండా బజారుమనిషిలా మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు. గతేడాది న్యూక్లియర్ చెయిన్ రియాక్షన్ అని రాష్ట్రం పరువు గంగలో కలిపారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు.
ఐటీ ఉద్యోగులను, ఇంజినీరింగ్ చదివేవాళ్లను కించపరచడం రేవంత్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. ఇంజినీరింగ్ చదివేవాళ్లు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్ అమ్ముతున్నారంటూ గతంలో మాట్లాడారు. అలాగే.. ఇంజినీర్ల కంటే మేస్త్రీలు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ ఇంజినీర్లను తక్కువచేసి మాట్లాడారు. ఇలా సందర్భం వచ్చిన ప్రతీసారి.. చదువుకున్న వాళ్లను తక్కువ చేసి మాట్లాడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. తెలంగాణ ప్రస్తుతం ఐటీ హబ్ గా ఉంది. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ప్రపంచం ముందు తెలంగాణ.. ఠీవిగా నిలబడిదంటే అది ఐటీ చలవే. దేశం నుంచి నిత్యం వేలకోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో లక్షలాది మంది నిపుణులు కంప్యూటర్ల ముందు పనిచేస్తేనే.. ఇది సాధ్యమవుతోంది. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్ల ముందు పనిచేసేవాళ్లు వర్కర్లు కాదు. వాళ్లంతా కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదువుకుని జ్ఞానం పెంచుకుని ఐటీ ఉద్యోగులు అయ్యారు. నీ లాగా బ్యాగులు మోసి పదవుల్లోకి వచ్చినవాళ్లు కాదు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Also Read:ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి: దాసోజు శ్రావణ్