హైడ్రా కూల్చివేతలపై దానం ఫైర్..

1
- Advertisement -

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తశుద్ది ఉంటే ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలని సవాల్ విసిరారు.అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరుగలేకపోతున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్‌ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. మాదాపూర్‌లో కుమారీ అంటీకి ఇచ్చిన మినహాఇంపును అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గత 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ బతుకుదెరువు సాగిస్తున్న తమ షాపులను తొలగిస్తే రోడ్డునపడుతామంటూ స్థానికులు రోదించినా.. అధికారులు కూల్చివేతలను ఆపలేదు అని దుయ్యబట్టారు.

చింతల్‌బస్తీలో ట్రాఫిక్‌ పోలీస్‌-జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రోప్‌ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ఇండ్లు కోల్పోయిన వారంతా రోజువారీగా పొట్టపోసుకునే చిరు వ్యాపారులే.

Also Read:తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -