దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం

2
- Advertisement -

యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్‌ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు అంగీకరించింది.

తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్

- Advertisement -