- Advertisement -
యువత ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో పడి విలువైన జీవితాన్ని కొల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ సరదా కాదు మీ కుటుంబానికి వ్యధ అని సూచించారు.
సరదాగా మొదలయ్యే బెట్టింగ్ ఖరీదు ఒక కుటుంబం అని మర్చిపోవద్దని సూచించారు. ఈజీ మనీకోసం వెళ్లి జీవితాన్ని పొగొట్టుకోవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్ యాడ్స్ అన్నీ మోసాలే అని గుర్తించాలన్నారు
వెయ్యి పెడితే లక్షలు రావని… బెట్టింగ్ ఊబిలో దిగి జీవితాన్ని బలి చేసుకోవద్దన్నారు. ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కి యువకులు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు.
Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్
- Advertisement -