కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఇందులో భాగంగా జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీణ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
29-01-2025
ఉదయం – ధ్వజారోహణం,
రాత్రి – చంద్రప్రభ వాహనం.
30-01-2025
ఉదయం – సూర్యప్రభవాహనం,
రాత్రి – పెద్దశేష వాహనం.
31-01-2025
ఉదయం – చిన్నశేష వాహనం,
రాత్రి – సింహ వాహనం.
Also Read:TTD: ఉత్తరాది భక్తుల కోసం శ్రీవారి ఆలయం
01-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం,
రాత్రి – హనుమంత వాహనం.
02-02-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం,
రాత్రి – గరుడ వాహనం.
03-02-2025
ఉదయం – కల్యాణోత్సవం,
రాత్రి – గజవాహనం.
04-02-2025
ఉదయం – రథోత్సవం,
రాత్రి – ధూళి ఉత్సవం.
05-02-2025
ఉదయం – సర్వభూపాల వాహనం,
రాత్రి – అశ్వ వాహనం.
06-02-2025
ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం,
రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.