సాధారణంగా ఉప్పును వంటింట్లో ఉపయోగిస్తుంటాము. ఉప్పు లేనిదే ఏ వంకటం కూడా రుచిగా అనిపించదు. కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు వేసి గుమగుమలాడే విధంగా చేసిన అదంతా వ్యర్థమే. అందుకే ఉప్పును వంటకాలకు గుండెకాయగా చెబుతుంటారు పెద్దలు. మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే ఉప్పు తెల్లగా ఉంటుంది. అయితే ఉప్పులో మరోరకం కూడా ఉందండోయ్ అదే రాక్ సాల్ట్. దీని ఉపయోగాలు తెలుసుకుందాం.
సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్‌లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి 80 రకాల మినరల్స్ ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తెల్ల ఉప్పులో కంటే పింక్ సాల్ట్‌లో సోడియం స్థాయులు తక్కువగా ఉంటాయి..రక్తపోటుతో ఇబ్బంది పడుతూ తక్కువ సోడియం తీసుకోవాలనుకునే వారికి ఇది మంచిది కాదు.
అలాగే పింక్ సాల్ట్ బాడీని తేమగా ఉంచుతూ.. ఎలక్ట్రోలైట్ల స్థాయులను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించి డిటాక్సిఫయింగ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు. ఆహారం తేలికగా జీర్ణం అవ్వడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
చర్మంపై మృత కణాలను తొలగించడం, శరీరం నుంచి వచ్చే చెడు వాసననూ దూరం చేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
Also Read:రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: హరీశ్