TTD:అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు

2
- Advertisement -

టీటీడీ తరఫున అయోధ్య రాముడికి చైర్మన్ బి.ఆర్.నాయుడు సతీ సమేతంగా ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు శ్రీరామ జన్మ భుమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్ళి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

చెన్నైకి చెందిన దాత శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టిటిడి ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం రూ. కోటి విలువైన డిడిలను టిటిడి అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టిటిడి ట్రస్టులకు గతంలో దాత అనేక మార్లు విరాళంగా అందజేశారు.

Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం

- Advertisement -