- Advertisement -
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్.
కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని.. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అన్నారు.ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని.. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని.. అయితే దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
Also Read:సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
- Advertisement -