బీఆర్ఎస్ రైతు మహా ధర్నా వాయిదా

8
- Advertisement -

న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ తలపెట్టిన మహా రైతు ధ‌ర్నా వాయిదా ప‌డింది. సంక్రాంతి పండుగ ప్ర‌యాణాలు, విజ‌య‌వాడ – హైద‌రాబాద్ హైవేపై ట్రాఫిక్ ర‌ద్దీతో పాటు త‌దిత‌ర కార‌ణాల‌తో పండుగ త‌ర్వాత మ‌హాధ‌ర్నా నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రైతు మహాధర్నాకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతార‌ని పార్టీ ప్ర‌క‌టించింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మహాధర్నాకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ.. సంక్రాంతి పండుగ ర‌ద్దీ, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశారు.

Also Read:చలనచిత్ర పరిశ్రమకు మైలురాయి:రాజమౌళి

- Advertisement -