పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం

1
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశలు చూపగా వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేసింది.

క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43మందికి పైగా టోకరా పెట్టింది కంపెనీ. కరీంనగర్ కు చెందిన బాధిత అర్ర మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదుతో 420, 120-B IPC కింద సిఐడి హైదరాబాద్ కేసునమోదు, దర్యాప్తు చేయగా క్రిప్టో కరెన్సీ 95కోట్ల నిందితుడు రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కుర్రెంల రమేష్ గౌడ్‌ స్వస్థలం నెల్లుట్ల గ్రామం, లింగలఘనపూర్ మండలం,జనగామ జిల్లా. రమేష్ గౌడ్ ఒక కొత్త వెబ్ సైట్ క్రీయేట్ చేసి అధిక పెట్టుబడుల లాభాలు అంటూ చాలా కుటుంబాల నుండి కోట్లు వసూళ్లు చేశారు. నిందితుడు రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సీఐడీ పోలీసులు.

Also Read:ఏపీకి మరో 50 మంది ఎమ్మెల్యే లు!

- Advertisement -