R Krishnaiah: చంద్రబాబు పాలనపై ప్రశంసలు

0
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు గుప్పించారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే… కరిగిపోయే మనస్సున్న నేత పవన్ కల్యాణ్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు.

చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని… సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడు అని కొనియాడారు. మేధావులలోనూ, విద్యావేత్తలలో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.

మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరాక తొలిసారి విశాఖకు వస్తున్నారని, ప్రధానికి నీరాజనం పట్టడానికి విశాఖ ప్రజలు సిద్దం అయ్యారన్నారు. విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read:హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్

- Advertisement -