సినిమాల్లోని ఛేజింగ్ సీన్ ను తలపించే ఘటన ఒకటి పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాధారంణంగా యాక్సిడెంట్ చేసి వాహనంలో పారిపోతున్నవారిని పోలీసులు సాహసోపేతంగా వెంబడించి పట్టుకోవడం చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ రీల్ మాదిరిగా కాకుండా రియల్ గానే జరిగింది.
సినిమా సన్నివేశాలను తలదన్నే రీతిలో అలాంటి ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ట్రక్కుతో వాహనాన్ని ఢీకొని పారిపోతున్న డ్రైవర్‌ని పట్టుకోవడానికి ఓ పోలీసు ప్రాణాలకు తెగించాడు. తాను చేసిన పనికి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
ఘటన వివరాల్లోకి వెళ్తే, పాకిస్థాన్ లోని ఒక పట్టణంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఒక లారీ వేగంగా వెళ్తూ ఒక వాహనాన్ని ఢీ కొట్టింది. దీనిని చూసిన ఒక పోలీసు అధికారి డ్రైవర్ ను పట్టుకునేందుకు వాహనాన్ని ఎక్కాడు. పోలీసును చూసిన డ్రైవర్ భయంతో వాహనాన్ని మరింత వేగంగా తీసుకెళ్లాడు. జాతీయ రహదారిపై లోపలికెళ్లే అవకాశం లేక, పోలీసు డ్రైవర్ కేబిన్ లోకెళ్లేందుకు ఉపయోగించే లెగ్ గార్డ్ మీద కాలుంచి వేలాడుతూ డ్రైవర్ ను వాహనం ఆపాలని హెచ్చరించాడు.
అదే సమయంలో వెనకే బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. పోలీసుని గమనించిన మరో వ్యక్తి తన బైక్‌ని వేగంగా ట్రక్కు ముందుకు పోనిచ్చాడు. ట్రక్కు ముందు కొన్ని వాహనాలు ఆగి ఉండడంతో చేసేదేంలేక డ్రైవర్ ట్రక్కు ఆపేశాడు.
దాంతో డ్రైవర్‌ను పోలీసు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టాడు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్ గా మారింది. ఆ పోలీసును పలువురు అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని మీరూ చూడండి మరి.
https://www.youtube.com/watch?v=5B8-cDKNEgE